Dasara Movie | ‘దసరా’ మూవీ క్రేజీ అప్డేట్.. నాని అభిమానులకు పండగే..!
Dasara Movie Intresting Update | నాని ప్రస్తుతం ఒక కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త కథలను చూపించాలకునే అతికొద్ది మంది నటులలో నాని ఒకడు. ఇటీవలే ఈయన నటించిన ‘అంటే సుందరానికీ’ విడుదలై యావరేజ్‌గా నిలిచింది.
Dasara Movie Intresting Update | నాని ప్రస్తుతం ఒక కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త కథలను చూపించాలకునే అతికొద్ది మంది నటులలో నాని ఒకడు. ఇటీవలే ఈయన నటించిన ‘అంటే సుందరానికీ’ విడుదలై యావరేజ్‌గా నిలిచింది. అయితే నాని సినిమాలకు టాక్ బాగానే వస్తున్నా కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించలేక పోతున్నాయి. నిజానికి నాని నటించిన గత ఐదారు చిత్రాలు కూడా కలెక్షన్ల పరంగా యావరేజ్‌గానే మిగిలాయి. ఈ క్రమంలో నాని ‘దసరా’ చిత్రంతో గతంలో ఎన్నడు చేయలేని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంతో ఎలాగైనా మాస్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.
శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ తెలంగాణ యాసలో ఉండే జానపద పాట అని టాక్. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది.
సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ చిత్రంలో నాని, కీర్తి డీ గ్లామర్ పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం నాని తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నాడని సమాచారం.
Read Also:
Dj Tillu-2 | ‘డీజే టిల్లు’ పార్ట్-2 షూటింగ్ ప్రారంభం.. దర్శకుడు ఎవరో తెలుసా?
Chiranjeevi | చిరు154 మూవీకి భారీగా నాన్-థియేట్రికల్ బిజినెస్.. వామ్మో అన్ని కోట్లా?
Adipurush | ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఆదిపురుష్ టీజర్ డేట్ ఫిక్స్?
Ponniyin Selvan-1 | ‘పొన్నియన్ సెల్వన్’ నటులకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కొక్కరికి అన్ని కోట్లా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

