Chiranjeevi | చిరు154 మూవీకి భారీగా నాన్-థియేట్రికల్ బిజినెస్.. వామ్మో అన్ని కోట్లా?
Mega154 Movie Non-Theatrical Rights | 'ఖైదీ నం.150'తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. అదే జోష్‌ను తన తదుపరి మూవీస్‌లో చూపించలేపోతున్నాడు. ఈ చిత్రం తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'సైరా' బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది. ప్రేక్షకుల నుండి గొప్ప ప్రశంసలు దక్కినా, కమర్షియల్‌గా ఈ చిత్రం సక్సెస్ సాధించలేకపోయింది.
Mega154 Movie Non-Theatrical Rights | ‘ఖైదీ నం.150’తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. అదే జోష్‌ను తన తదుపరి మూవీస్‌లో చూపించలేపోతున్నాడు. ఈ చిత్రం తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘సైరా’ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది. ప్రేక్షకుల నుండి గొప్ప ప్రశంసలు దక్కినా, కమర్షియల్‌గా ఈ చిత్రం సక్సెస్ సాధించలేకపోయింది. ఈ తర్వాత వచ్చిన ‘ఆచార్య’ ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఫలితం ఎలా ఉన్న చిరు మాత్రం వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ ఒకటి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
షూటింగ్ దశలో ఉండగానే ఈ చిత్రానికి భారీగా ఆఫర్స్ వస్తున్నాయట. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం తాజాగా ఈ చిత్రానికి భారీ స్థాయిలో ఓటీటీ డీల్ కుదిరినట్లు టాక్. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాదాపు రూ.50 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇక ఇప్పటికే ‘గాడ్‌ఫాదర్’ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.57 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వరుసగా రెండు ఫ్లాప్‌లు వచ్చిన మెగాస్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ నంబర్లను చూస్తే తెలుస్తుంది. ఇక చిరు.. బాబీ చిత్రంలో అండర్ కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. చిరుకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది.
ప్రస్తుతం చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ విడుదలకు సిద్ధంగ ఉంది . మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సల్మాన్‌ఖాన్ అతిధి పాత్రలో నటించగా సత్యదేవ్, నయనతార కీలకపాత్రలు పోషించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also:
Ponniyin Selvan-1 | ‘పొన్నియన్ సెల్వన్’ నటులకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కొక్కరికి అన్ని కోట్లా?
Karthikeya-2 | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కార్తికేయ-2’.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
BalaKrishna | కత్తితో ఫైటింగ్ చేస్తున్న బాలకృష్ణ.. NBK107 షూటింగ్ వీడియో వైరల్
The Ghost | ‘శివ’ సెంటిమెంట్ ‘ది ఘోస్ట్’ చిత్రానికి వర్కవుట్ అవుతుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

