BalaKrishna | కత్తితో ఫైటింగ్ చేస్తున్న బాలకృష్ణ.. NBK107 షూటింగ్ వీడియో వైరల్
NBK107 Shooting Video | 'అఖండ' చిత్రంతో నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు బాలకృష్ణ. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రంతో వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అదే జోష్‌తో బాలకృష్ణ తన తదుపరి సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు.
NBK107 Shooting Video | ‘అఖండ’ చిత్రంతో నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు బాలకృష్ణ. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రంతో వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అదే జోష్‌తో బాలకృష్ణ తన తదుపరి సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పొలిటికల్ టచ్ ఉన్న మాస్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని.. బాలకృష్ణతో సినిమా చేయనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన బాలయ్య పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ టర్కీలో జరుగుతుంది. తాజాగా ఈ మూవీకి సంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
టర్కీలో బాలయ్య అభిమానులు షూటింగ్ స్పాట్‌కు వచ్చి, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా ఒక వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బాలయ్యకు రౌడీలకు మధ్య ఫైటింగ్ జరుగుతుంది. బాలయ్య ఓ రౌడీ చేయి నరికి అటు ఇటు తిరుగుతున్నాడు. బాలయ్యను చూస్తూ రౌడీలంతా అటు భయంతో ఇటు కోపంతో రగిలిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఎస్ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అనే టైటిల్ దాదాపు కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తుంది. అఖండ సక్సెస్‌తో ఈ చిత్రానికి భారీ స్థాయిలో నాన్-థియేట్రికల్ బిబినెస్ జరిగింది. దాదాపు రూ.60 కోట్ల వరకు నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా రూ.70 కోట్లు దాటుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.
From the set's of #NBK107 Turkey Action Schedule 🔥🔥🔥#GodOfMassesNBK @megopichand @shrutihaasan #JaiBalayya @NBK_Unofficial @Mokshagna_Offl @BalayyaUvasena @ALINTR9999 @NtrMaruthi9999 @Mahisiri161 @venutarak14 pic.twitter.com/8FZn7ivutf
— NTR Fans Anantapur Official (@NTRFansATP39) September 26, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

