Dj Tillu-2 | ‘డీజే టిల్లు’ పార్ట్-2 షూటింగ్ ప్రారంభం.. దర్శకుడు ఎవరో తెలుసా?
Dj Tillu-2 Movie Shooting | ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న సిద్ధూ జొన్నలగడ్డకు 'డీజే టిల్లు' మంచి బ్రేక్ ఇచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత సినిమాలు విడుదల చేయాలా? వద్ధా? అనే సంధిగ్ధంలో ఉన్న టాలీవుడ్ దర్శక నిర్మాతలకు 'డీజే టిల్లు' సినిమా ధైర్యాన్నిచ్చింది.
Dj Tillu-2 Movie Shooting | ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న సిద్ధూ జొన్నలగడ్డకు ‘డీజే టిల్లు’ మంచి బ్రేక్ ఇచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత సినిమాలు విడుదల చేయాలా? వద్ధా? అనే సంధిగ్ధంలో ఉన్న టాలీవుడ్ దర్శక నిర్మాతలకు ‘డీజే టిల్లు’ సినిమా ధైర్యాన్నిచ్చింది. ఈ ఏడాది మార్చి 12 విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని భారీ వసూళ్ళను సాధించింది. ఈ చిత్రంలో సిద్ధూ జొన్నలగడ్డ నటన, తెలంగాణ యాసలో సిద్ధూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. ముఖ్యంగా యూత్‌లో సిద్ధూకు ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. కమర్షియల్గానూ ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధించింది. ఇక ఈ మూవీ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజాగా డీజె టిల్లు సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కారు సీన్‌తో షూటింగ్ స్టార్ట్ అయినట్లు ఫోటోలు చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సీక్వెల్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పీడీవి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ట్‌టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సీక్వెల్ చిత్రానికి కూడా సిద్ధూ కథను అందించడం విశేషం. కాగా ఈ సీక్వెల్ చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ‘అద్భుతం’ సినిమాకు దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ ‘డీజే టిల్లు’ పార్ట్-2ను రూపొందిస్తున్నాడు. కాగా మొదటి భాగానికి దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ.. హీరోతో బేధాబిప్రాయాలు రావడంతో సినిమా నుండి తప్పుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
The madness begins!#djtillu2 pic.twitter.com/bqEIVRZZvZ
— Mallik Ram (@MallikRam99) September 26, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

