నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ైక్లెమాక్స్ ఘట్టాల చిత్రీకరణ గోదావరిఖని బొగ్గుగని సెట్లో మంగళవారం ప్రారంభమైంది. పదిహేను రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో కీలకమైన ైక్లెమాక్స్ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా హీరో నాని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లొకేషన్ ఫొటోని షేర్ చేశారు. ‘ైక్లెమాక్స్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. దీని తర్వాత ఓ పాట మాత్రమే బ్యాలెన్స్‌గా ఉంటుంది.
ఇటీవల విడుదలైన ఫస్ట్‌సాంగ్ ‘ధూమ్ ధామ్’కు మంచి స్పందన లభించింది’ అని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం మార్చి 30న విడుదలకానుంది. కీర్తి సురేష్, సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌సూర్యన్, సంగీతం: సంతోష్ నారాయణన్, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.