Nani| నేచురల్ స్టార్ నాని సినిమాలకి ఆడియన్స్‌లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన సినిమాలకి మినిమం రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇటీవల పంథా మార్చారు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్‌పై దృష్టి పెడుతూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నాని ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే మూవీ చేస్తున్నారు. మ్యాడ్ మ్యాక్స్ స్టైల్ షేడ్స్‌తో మిక్స్ చేసిన మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి ‘రా స్టేట్మెంట్’ పేరుతో ఓ వీడియో రిలీజ్ కాగా, ఇందులో వినిపించిన డైలాగ్‌లు, నాని లుక్, గెటప్ అన్నీ ఊరమాస్ అన్నట్టుగా ఉన్నాయి.
ఇక నాని గెటప్ అయితే అదిరిపోయింది. రెండు జడలతో రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించి సినిమాపై అంచనాలు మరింత పెంచేశాడు. ఇక తాజాగా విడుదలైన నాని లుక్ పోస్టర్ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. మిషిన్ గన్ తో, వీరుడిలా కనిపిస్తున్న నాని వర్షాన్ని తట్టుకుని నిలబడి కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే వెండితెరపై హైవోల్టేజ్ వైబ్ దక్కడం గ్యారెంటీ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 1980ల కాలాన్ని ఆధారంగా మ్యాడ్ మ్యాక్స్ శైలిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ సుమారు 110-120 కోట్లు వరకు ఉండే అవకాశం ఉంది. 2026 మార్చి 26న ఈ చిత్రం రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. కాని అదే సమయానికి రామ్ చరణ్-బుచిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కూడా విడుదల కావొచ్చనే టాక్ నడుస్తుంది.
అదే వారానికి ముందు రణ్‌బీర్ కపూర్ లవ్ అండ్ వార్, యశ్ ‘టాక్సిక్’ సినిమా కూడా విడుదల అవుతుండడం వలన నాని ఈ డేట్‌ని ఏమైన మార్చే అవకాశం ఉందా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. అయితే తాజా పోస్టర్లో రిలీజ్ డేట్ 26.3.26 అని ప్రకటించారు. ఇంకా 365 రోజులు అంటూ నాని కొత్త పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ పోస్టర్ చూసిన తర్వాత నాని లుక్‌కి నెటిజన్స్ మెస్మరైజ్ అయిపోతున్నారు. తిరుగుబాటు, నాయకత్వంతో పాటు తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో నాని ‘ది ప్యారడైజ్’ తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రం నాని కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉంది.