నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘ఓరి వారి’ అనే రెండో గీతాన్ని ఈ నెల 13న విడుదల చేయబోతున్నారు. హార్ట్‌బ్రేక్ సాంగ్ ఇదని, తన విఫల ప్రేమ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ కథానాయకుడు పడే మనోవేదనను ఆవిష్కరిస్తుందని దర్శకుడు తెలిపారు. ‘ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.
నాని మాస్ లుక్ అందరిని ఆకట్టుకుంది. ఆయన కెరీర్లో విభిన్న కథగా నిలుస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. కీర్తి సురేష్, సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, సంగీతం: సంతోష్ నారాయణన్, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.