శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హిట్. క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్లో విశ్వక్ సేన్ నటించిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. కాగా డైరెక్టర్ శైలేష్ 2021లో ఈ సినిమాకు సీక్వెల్ హిట్..ది సెకండ్ కేస్ (HIT 2)ను ప్రకటించాడు. కాగా తాజాగా చాలా రోజుల తర్వాత హిట్ 2పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని న్యాచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నాడు.
సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్ 2న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు.
కొత్త పోస్టర్ విడుదల చేస్తూ విడుదల తేదీని ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు నాని. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రావు రమేశ్, భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్లభరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలీ ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంతి టిపిర్నేని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అడివి శేష్ ఈ ఏడాది పాన్ ఇండియా ప్రాజెక్టు మేజర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
2nd case on 2nd December 🔒
KD @adivisesh on 🔥#HIT2onDEC2 @KolanuSailesh @PrashantiTipirn #MeenakshiChaudhary @maniDop #JohnStewartEduri @SVR4446 @walpostercinema pic.twitter.com/yhNltECCds
— Nani (@NameisNani) September 15, 2022
Read Also : Telugu Film Chamber | తెలుగు ‘ఫిల్మ్ ఛాంబర్-ఫిల్మ్ ఫెడరేషన్’ చర్చలు సఫలం..వివరాలివే..!
Read Also : Indian 2 | ఇండియన్ 2లో కమల్‌హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్‌లో అంతా షాక్..!
Read Also :God Father | ‘గాడ్‌ఫాదర్’ ఫస్ట్ సింగిల్ టైం ఫిక్స్.. రిలీజ్ ఎన్నిటికంటే?
Read Also : Vikram Vedha | బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్.. ‘విక్రమ్ వేధ’ ఎన్ని దేశాల్లో రిలీజవుతుందో తెలుసా..?