Nani | నేచురల్ స్టార్ నాని నటుడిగా ఎంతవరకు పేరు తెచ్చుకున్నాడో, వ్యక్తిగా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని ఇప్పుడు స్టార్ హీరోగాను, సక్సెస్ ఫుల్ నిర్మాతగాను సత్తా చాటుతున్నాడు. తాజాగా ఆయన ప్రముఖ నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ప్రముఖ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో గెస్ట్‌గా పాల్గొని తన అభిమానులను అలరించారు.ఈ షోలో నాని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే.. 17 ఏళ్ల క్రితం నాని ధరించిన ఒక పాత టీ షర్ట్. ఎపిసోడ్ మధ్యలో జగపతి బాబు ఒక టీ షర్ట్ చూపించి, “ఈ షర్ట్ గుర్తుందా?” అని నానిని అడిగారు. షర్ట్‌ను చూసిన నాని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆ షర్ట్ వెనక ఉన్న ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.
అష్టాచెమ్మా సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో, జూబ్లీహిల్స్‌లోని పార్క్ లో నేను వేసుకున్న షర్ట్ ఇది. అప్పట్లో ప్రొఫెషనల్ ఫోటోషూట్ చేసే అవకాశం లేక, ఈ షర్ట్ మీదే ఫోటోలు తీసి పంపించాను. ఆ ఫొటోలే నాకు నటుడిగా తొలి అవకాశం తీసుకురావడంలో కీలకం అని అన్నారు. అంతేకాదు, అదే టీ షర్ట్‌ను ఆయన తన జీవిత భాగస్వామి అంజుని మొదటిసారి కలిసేటప్పుడు కూడా ధరించారట.అంజుతో మొదటి మీటింగ్ సమయంలో ఇదే షర్ట్ వేసుకున్నాను. అందుకే నాకు ఈ షర్ట్ ప్రత్యేకమైన జ్ఞాపకం. అంజు ఇప్పటికీ దాన్ని జాగ్రత్తగా దాచుకుంది. ఆమె మీకే ఇచ్చి ఉంటుంది” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు నాని.
ప్రస్తుతం నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ దశలో ఉంది. ఇదివరకే దసరా, హిట్ 3 వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న నాని, నటనతో పాటు నిర్మాతగా కూడా కొత్త టాలెంట్‌కు ప్రోత్సాహం ఇస్తూ ముందుకెళ్తున్నారు. అయితే నానికి సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక నెటిజన్లు కూడా “నాని నిజంగా నేచురల్ స్టార్.. ఎంత డౌన్ టు ఎర్త్‌గా ఉంటాడో ఈ సంఘటన మరోసారి చూపించింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.