అడివి శేషు ‘హిట్ -2’ సినిమా ముగింపులోనే ‘హిట్-3’ నాని హీరోగా ఉంటుందని చెప్పేశాడు దర్శకుడు శైలేష్ కొలను. తొలి రెండు భాగాలు పెద్ద హిట్లు అవ్వడం, దానికి తోడు మూడో పార్ట్ హీరో నాని కావడంతో ఈ ఫ్రాంచైజీపై విపరీతమైన హైప్ ఏర్పడింది. ‘హిట్- 3’ అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘హిట్-3’పై అప్డేట్ రానేవచ్చేసింది.
గురువారం ‘HIT: The 3rd Case’ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో భాగంగా నాని పాత్రపై స్నీక్ పీక్ అందిస్తూ ఓ గ్లింప్స్‌ని విడుదల చేశారు. మంచు పర్వతాల మధ్య కారుతో దూసుకుపోతున్న హిట్ ఆఫీసర్ని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఛేజ్ చేస్తుండగా ఈ గ్లింప్స్ మొదలైంది.
హిట్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని సిగార్ తాగుతూ, రక్తపు చేతులతో కారు నడుపుతూ, మరోవైపు గొడ్డలితో ైస్టెలిష్‌గా ఫెరోషియస్‌గా కనిపించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మాత: ప్రశాంతి త్రిపురనేని, నిర్మాణం: వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్.