హీరో నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘అంటే సుందరానికి’ చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి నాని మరో చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా ఖరారైంది. శనివారం అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు.
ఈ నెల 24 సినిమా ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన టైటిల్ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నది. ఈ చిత్రానికి ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. నాని నటిస్తున్న 31వ చిత్రమిది.