నేచురల్ స్టార్ నాని ఇప్పుడు టాలీవుడ్లో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. నిర్మాతగానే కాకుండా హీరోగాను దూసుకుపోతున్నాడు. సాధారణంగా నాని సినిమాలంటే ఆడియన్స్‌కి ఓ మంచి ఒపీనియన్ ఉంటుంది. సినిమా పక్కా హిట్ అని భావిస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉండే నాని ఇప్పుడు కాస్త రూట్ మార్చాడు. హిట్ 3, ది ప్యారడైజ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకి డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నాని నటించిన హిట్ 3 చిత్రం మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు.
పవన్ కళ్యాణ్ సినిమా పూర్తయితే తప్ప నాని సినిమా మొదలు కాదని తాజా ఇంటర్వ్యూలో నాని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ సినిమాతో నాని సినిమాకి సంబంధం ఏంటనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతూ ఉంటుంది. విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గత కొన్నాళ్ల నుండి వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా పూర్తి చేసి వెంటనే నానితో ఓ సినిమా చేయాలని సుజీత్ అనుకుంటున్నాడట.
హిట్ 3 ప్రమోషన్స్ లో నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా చేస్తున్నాను. అది అయిన తర్వాత సుజీత్ సినిమా చేయాలి కానీ సుజీత్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా పూర్తి చేస్తే, అప్పుడు సుజీత్ నా సినిమా చేస్తాడు అని చెప్పుకొచ్చాడు.. పవన్ కళ్యాణ్‌తో ఓజీ చిత్రం తెరకెక్కిస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు నానితో ఓ చిత్రం చేయబోతుంది. సో నాని – సుజీత్ సినిమా మొదలవ్వాలంటే పవన్ కళ్యాణ్ ఓజీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.. అది జరగాలి అంటే పవన్ డేట్స్ ఇవ్వాలి. మొత్తానికి నాని తర్వాతి సినిమా భవిష్యత్ పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంది.