Nani | సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగినప్పటి నుండి సెలబ్రిటీలకి అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. వారిని ఏదో ఒకలా వేధించడం, లేదంటే నెగెటివ్ ప్రచారం చేయడం, సినిమాలని ఫ్లాపులు అంటూ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల తప్పుడు రివ్యూలపై సెలబ్రిటీలు ఓపెన్‌గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. విజయ శాంతి, నాగవంశీ వంటి వారు తప్పుడు రివ్యూలని ఇచ్చే వారికి ఇన్‌డైరెక్ట్ పంచ్‌లు ఇచ్చారు. ఇక ఇప్పుడు నాని కూడా ఈ జాబితాలో చేరాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తూ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ `హిట్ ద థర్డ్ కేస్`. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
పాన్ ఇండియా వైడ్‌గా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో హిట్ చిత్రం విడుదల కానుంది. మరి కొద్ది రోజులలో మూవీ విడుదల కానున్న నేపథ్యంలో నాని, శ్రీనిధి శెట్టి తెగ ప్రచారాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో నాని రివ్యూలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. `హిట్ 3` ప్రమోషన్స్‌లో భాగంగా నాని రివ్యూల గురించి మాట్లాడుతూ..ఒకప్పుడు అయితే ఓకేగానీ ఇప్పుడు ఎవరిని ఆపలేకపోతున్నాం. ఫలానా పాట బాలేదు, లేదంటే సీన్ బాలేదు అని చెప్పవచ్చు. కాని సినిమా ఆడదు అని డిసైడ్ చేయోద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను.
సినిమాని ప్రేక్షకులు చూడకపోతే అప్పుడు డిజాస్టర్ అని డిక్లేర్ చేయండి ..నా సినిమాల విషయంలో జరగలేదు కానీ కొన్ని మూవీస్ విషయంలో కొందరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లు చూస్తే తల నొప్పి వచ్చేసింది. ప్రొఫెషనల్స్ కూడా అలా చేయడం బాలేదు. తక్కువ రేటింగ్ వచ్చిన సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన సందర్భాలు ఉన్నాయి. పెట్టిన పెట్టుబడి మొత్తంగా రాకపోతే అలాంటి సినిమాలను డిజాస్టర్‌గా లెక్కేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పది రోజుల తరువాత కూడా ఆ సినిమా ఎవరూ చూడకపోతే, పెట్టిన పెట్టుబడిని రాబట్టలేకపోతే అలాంటి సినిమాలని మాత్రమే డిజాస్టర్లుగా పరిగణించమంటూ నాని విజ్ఞప్తి చేయడం గమనర్హం.