ఆ రోజు కోసం నిరీక్షణ
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన మలయాళ ప్రేమకథా చిత్రం ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' 300కోట్లకు పైగా వసూళ్లతో అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా ఈ తరహా సినిమాలు రావాల్సిన అవశ్యకత గురించి అగ్ర హీరో నాని తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన మలయాళ ప్రేమకథా చిత్రం ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ 300కోట్లకు పైగా వసూళ్లతో అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా ఈ తరహా సినిమాలు రావాల్సిన అవశ్యకత గురించి అగ్ర హీరో నాని తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. తెలుగులో కూడా ఓ సాధారణ ప్రేమకథ మూడొందల కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించాలన్నది తన అభిమతమని ఆయన అన్నారు. ‘నిజాయతీగా, ప్రేక్షకుల హృదయాల్ని స్పృశించే కథాంశాలతో సినిమాలు తీసినప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ తప్పకుండా థియేటర్లకు వస్తారు. సహజమైన భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండే సినిమాల్ని నిర్మించాలి.
టాలీవుడ్లో అలాంటి మార్పు కోసం నిరీక్షిస్తున్నా. చిన్న ప్రేమకథ సైతం రికార్డులు తిరగరాస్తే చూడాలనుంది’ అని నాని అన్నారు. ప్రస్తుతం తాను నిర్మాతగా నితిన్‌తో రూపొందిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ కూడా హృదయానికి హత్తుకునే కథాంశమని ఆయన చెప్పారు. ఇటీవలే ‘ది ప్యారడైజ్’ చిత్రంతో మంచి విజయాన్ని సాధించారు నాని.ప్రస్తుతం ఆయన సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ చిత్రంలో నటిస్తున్నారు. ఢిల్లీలో ఈ సినిమా తాజా షెడ్యూల్ జరుగుతున్నదని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

