Dasara movie | సాధారణంగా గ్లామర్ పాత్రలలోనే నటినటులు ఎక్కువగా కనిపిస్తుంటారు. కాని కథ డిమాండ్ చేస్తే ఎంతటి స్టార్లు అయిన డీ గ్లామరస్ పాత్రలను చేయడానికి సిద్దంగా ఉంటారు. తాజాగా పుష్ప చిత్రంలో నటులంతా డీ గ్లామరస్ గానే నటించారు. అయితే ఇదే బాటలో మరో హీరో హీరోయిన్లు డీ గ్లామరస్ పాత్రలలో నటించండానికి సిద్దమయ్యారు. వాళ్ళెవరో కాదు…నాని, కీర్తి సురేష్. వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ దసరా. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
తెలంగాణలోని గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుంది. కాగా ఈ కథ డిమాండ్ చేయడంతో నాని, కీర్తిసురేష్‌లు డీ గ్లామరస్ పాత్రలలో నటించనున్నారు. ఇందులో నాని పూర్తిగా తెలంగాణ యాసలో మాట్లడబోతున్నట్లు టాక్.ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన భారి సెట్ ను 12 ఎకరాల్లలో 12 కోట్లు ఖర్చుపెట్టి ఒక విలేజ్ సెట్‌ను ఏర్పాటుచేశారని సమాచారం.ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం నాని నటించిన అంటే సుందరానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తుంది.