Nani | 18 ఏళ్ల సినీ ప్రయాణం.. అభిమానులకు నాని స్పెషల్ ప్రామిస్, ‘ది ప్యారడైజ్’ క్లిప్ వైరల్
Nani | టాలీవుడ్లో ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన స్వశక్తితో ఎదిగి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. సహజమైన నటన, విభిన్నమైన కథల ఎంపిక, తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
Nani | టాలీవుడ్లో ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన స్వశక్తితో ఎదిగి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. సహజమైన నటన, విభిన్నమైన కథల ఎంపిక, తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటున్న నాని.. తాజాగా తన సినీ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని పూర్తి చేసుకున్నారు. నాని సినీ రంగ ప్రవేశం చేసి తాజాగా 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్టులు, ఎడిట్స్, వీడియోలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. నాని కెరీర్‌లోని కీలక చిత్రాలను గుర్తు చేసుకుంటూ.. ఆయన సాధించిన విజయాలను సెలబ్రేట్ చేశారు.
ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా మారి నేచురల్ స్టార్‌గా ఎదిగిన నాని ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. వరుస విజయాలతో పాటు వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. తన 18 ఏళ్ల సినీ ప్రయాణంపై నాని కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 18 ఏళ్లు పూర్తవడంతో సినిమాల్లో తాను ఇప్పుడు పెద్దవాడినయ్యాననే భావనను సరదాగా వ్యక్తం చేశారు. సాధారణంగా 18 ఏళ్లు దాటితే అడల్ట్ అంటారు కదా.. అదే విధంగా టాలీవుడ్లో కూడా తనకు 18 ఏళ్ల వయసు వచ్చినట్లుగా నాని సరదాగా చెప్పుకొచ్చారు.అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన మరో కామెంట్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంది. ఇన్నేళ్లుగా తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ తేలికగా తీసుకోనని నాని స్పష్టం చేశారు.
తన కెరీర్లో అభిమానుల పాత్ర ఎంతో కీలకమనే విషయాన్ని నాని మరోసారి గుర్తు చేసుకున్నారు. తనపై ప్రేక్షకులు, అభిమానులు చూపిస్తున్న ప్రేమను తాను ఎప్పుడూ అలుసుగా తీసుకోలేదని.. భవిష్యత్తులోనూ తీసుకోనని ప్రామిస్ చేశారు.18 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా నాని చేసిన ఈ మాటలు అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యాయి. స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత కూడా అభిమానుల ప్రేమకు ఇంత విలువ ఇస్తూ మాట్లాడటంతో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ఇక తన 18 ఏళ్ల సినీ ప్రయాణానికి సంబంధించిన ఈ ప్రత్యేక సందర్భాన్ని నాని తన రాబోయే చిత్రం ‘ది ప్యారడైజ్’కు సంబంధించిన క్లిప్‌తో పంచుకోవడం మరింత ఆసక్తిని పెంచింది. సినిమా నుంచి షేర్ చేసిన ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
18 years.
Officially an adult in cinema 🙂Never took your love for granted. I won’t ever. ♥️ pic.twitter.com/s6lcXTSs1Y
— Nani (@NameisNani) September 5, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- actor
- Chiranjeevi
- Father
- Mother
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

