Nandamuri Taraka Ratna | ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ చిత్రంతో నందమూరి వారసుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు నందమూరి తారక రత్న. 2002లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా అంత సక్సెస్ కాకపోయినా తారక రత్నకు మాత్రం మంచి నటుడు అనే పేరు వచ్చింది. ‘యువరత్న’, ‘భద్రాద్రి రాముడు’ వంటి చిత్రాలు తారక రత్నకు మంచి పేరును తీసుకువచ్చాయి. కానీ తారక రత్న కథలను ఎంపిక చేసుకునే విధానంలో విఫలం అయ్యాడు. వరుస ఫ్లాప్‌లు వెంటబడటంతో హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు. ప్రస్తుతం ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నాడు. తాజాగా ఈయన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వూ ఇచ్చాడు.
ఇంటర్వూలో భాగంగా యాంకర్ ‘ఎన్టీఆర్‌కు పోటీగా నందమూరి ఫ్యామిలీ మిమ్మల్ని హీరోగా దింపారు అనే ప్రచారం జరిగింది. దానిపై మీరేమంటారు’ అని అడుగగా.. దానికి తారక రత్న ‘అదంతా తప్పుడు ప్రచారం. తారక్ సినిమాల్లోకి వచ్చిన తర్వాతే నేను సినిమాల్లోకి వచ్చాను. అప్పటికే తమ్ముడికి ‘ఆది’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. నేను, ఎన్టీఆర్‌కు కాంపెటీషన్ కాదు. నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఎన్టీఆర్ గ్రేట్ ఆర్టిస్టు. ఈ రోజు నందమూరీ ఫ్యామిలీ నిలబడుతుందంటే దానికి ఎన్టీఆర్ కూడా కారకుడే. నేను హీరో కావాలనేది నా డ్రీమ్. దానికోసం నాన్న, బాబాయ్‌లు సపోర్ట్ ఇచ్చారని తెలిపాడు. అంతేకాకుండా తమ్ముడు ఎన్టీఆర్ ముందుకెళ్ళినా.. అన్న కళ్యాణ్ రామ్ ముందుకెళ్ళినా నందమూరీ ఫ్యామిలీనే ముందుకు వెళ్తుంది. అందుకే ఏ రోజు కూడా నేను వాళ్ళతో పోటీ భావించలేదు. తారక్ సక్సెస్‌ను చూసి అన్నగా సంతోషపడుతున్నానంటూ ఇంటర్వూలో క్లారిటీ ఇచ్చాడు.