Nandamuri Taraka Ramarao | సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి సినిమాలతో డైరెక్టర్‌గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు వైవీఎస్ చౌదరి (YVS Chowdary). ఇప్పటికే పలువురు యాక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం నుంచి కొత్త నటుడిని అందరికీ పరిచయం చేస్తున్నాడు.
దివంగత సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ మనవడు (జానకిరామ్ కుమారుడు) నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao) ఫస్ట్ దర్శన్ వీడియోను షేర్ చేశాడు వైవీఎస్ చౌదరి. ప్రొడక్షన్ నంబర్ 1గా రాబోతున్న ఈ చిత్రాన్ని New Talent Roars బ్యానర్లో వైవీఎస్ చౌదరి సతీమణి యలమంచిలి గీత నిర్మిస్తుండటం విశేషం.
నందమూరి తారకరామారావు హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫస్ట్ దర్శన్ వీడియో చెప్పకనే చెబుతోంది. నటుడిగా అందరినీ ఇంప్రెస్ చేసేందుకు యాక్టింగ్, ఫైట్స్‌లో శిక్షణ తీసుకోవడంతోపాటు మేకోవర్ కూడా మార్చుకున్నట్టు తాజా లుక్స్‌తో తెలిసిపోతుంది. ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు. చంద్రబోస్ పాటలు అందిస్తున్నాడు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
నందమూరి తారక రామారావు స్టిల్స్..
Incredibly Dapper Looks of debutant hero 𝐍andamuri 𝐓araka 𝐑amarao, the great-grandson of Legend NTR💥😍
He is ready to set the big screens ablaze with his powerful presence and charming looks under the stunning vision of dynamic director @helloyvs ❤️🔥
Watch his FIRST DARSHAN… pic.twitter.com/h0Pbv73ES7
— BA Raju’s Team (@baraju_SuperHit) October 30, 2024
New day, new beginnings, and a new journey ahead ✨
Tune in live to watch the dynamic director @helloyvs‘s sensational announcement live:
▶️ https://t.co/xkIUodjwGf@NewTalentRoars #YVSChowdary @MediaYouwe @UrsVamsiShekar pic.twitter.com/KGg0rTeUkw— YouWe Media (@MediaYouwe) June 10, 2024
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా..?
Zebra | సత్యదేవ్ జీబ్రా కొత్త విడుదల తేదీ వచ్చేసింది..