Nandmuri Mokshagna | షాకింగ్ లుక్ లో నందమూరి మోక్షజ్ఞ.. ఎంట్రీకి సిద్దమైనట్లేనా?
Mokshagna | నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ గురించి సర్వాత్రా ఆసక్తి నెలకొంది. ఎలాంటి కథతో వస్తున్నాడు? ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు? అనే ప్రశ్నలు ప్రతీ నందమూరి అభిమానుల మదిల్లో మెదులుతున్నాయి.
Mokshagna | నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ గురించి సర్వాత్రా ఆసక్తి నెలకొంది. ఎలాంటి కథతో వస్తున్నాడు? ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు? అనే ప్రశ్నలు ప్రతీ నందమూరి అభిమానుల మదిల్లో మెదులుతున్నాయి. ఇక ఈ మధ్య మోక్షజ్ఞ తండ్రి బాలయ్య సినిమా సెట్స్ ను తెగ చుట్టేస్తున్నాడు. వీరసింహా రెడ్డి టైమ్ లో మోక్షజ్ఞ పలు సార్లు సెట్స్ లో సందడి చేశాడు. ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే తాజాగా మోక్షజ్ఞను చూసి అందరూ తెగ షాక్ అయిపోతున్నారు. ఒకప్పుడు లావుగా అసలు హీరో మెటీరియల్ లానే లేడు అనుకున్న మోక్షజ్ఞ.. ఇప్పుడు స్లిమ్ గా, హీరో అంటే ఇలా ఉండాలి అనేంతలా మారిపోయాడు.
ఆ మధ్య నటనలోకి అడుగు పెట్టడానికి మోక్షజ్ఞనే ఆసక్తి చూపించట్లేదని గుసగుసలు వినిపించాయి. అలాంటి అభిప్రాయం కలగడానికి తన లుక్స్ ప్రధాన కారణం. ఒకప్పుడు మోక్షజ్ఞ చాలా లావుగా కనిపించాడు. ఒక దశలో విపరీతంగా బరువు పెరిగిపోయి.. పొట్టతో కనిపించి అభిమానులకు షాకిచ్చాడు. దాంతో చాలా ముందు మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదోమో అనుకున్నారు. అంతెందుకు ఏడాది ముందు కూడా మోక్షజ్ఞ లుక్స్ హీరోకు తగ్గట్లు లేవు. అయితే మళ్లీ గతకొంత కాలంగా మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెగ ప్రచారం జరుగుతుంది.
అంతేకాకుండా బాలయ్య కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిన ఆదిత్య369 సినిమా సీక్వెల్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు బాలయ్యనే స్వయంగా దర్శకత్వం వహించబోతున్నాడట. కాగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసమే బాలయ్య కొడుకు లుక్స్ పై మరింత కేర్ తీసుకున్నాడట. ఈ క్రమంలోనే చాలా స్లిమ్ గా అయి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఇంత త్వరగా సన్నమవడానికి తారక్ లానే సర్జరీ చేయించుకున్నాడని అందరూ భావిస్తున్నారు. ఇక ఏదేమైనా ఇలా మోక్షజ్ఞ తేజ లుక్స్ చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!
RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

