Nandamuri Jayakrishna Wife | టాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటడుతున్నాయి. సోమవారం కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి కన్నుమూసిందని వార్త నుంచి తేరుకునేలోపు టాలీవుడ్‌కి మరో షాక్ తగిలింది. తాజాగా నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. దివంగత నటుడు నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ (62) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
పద్మజ మృతి పట్ల నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఆమె దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయానా సోదరి. అలాగే, సినీ నటుడు నందమూరి చైతన్య కృష్ణకు తల్లి. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా.. పద్మజ అంత్యక్రియలు హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించనున్నారు.