Balakrishna | బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం ‘ఎన్బీకే 109’. కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకత సమాహారంగా ఈ సినిమా రూపొందుతున్నదని చెప్పాలి. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో మలయాళ అగ్రహీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. ‘యానిమల్’లో విలన్గా నట విశ్వరూపం చూపించిన బాబీడియోల్ ఇందులో విలన్గా చేస్తున్నారు.
గౌతమ్ వాసుదేవ మీనన్ కూడా ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా కథానాయికలుగా శ్రద్ధాశ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా.. ఓ విధంగా ఈ మధ్య వచ్చిన బాలయ్య చిత్రాల్లో ఇంత ప్యాడింగ్ లేదనే చెప్పాలి. కథ డిమాండ్ చేయడంవల్లే వీళ్లందర్నీ తీసుకోవాల్సి వచ్చిందని దర్శకుడు బాబీ చెబుతున్నారు.. బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్.. వయోలెన్స్ కా విజిటింగ్ కార్డ్.. అనిపించేలా ఇందులో బాలయ్య కేరక్టరైజేషన్ ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల చేయనున్నట్టు సమాచారం.