Bala Krishna: బాలకృష్ణ పెద్ద మనసు.. ఐదు లక్షల రూపాయలు మాఫీ!

మన హీరోలు రీల్ లైఫ్‌లోనే కాక రియల్ లైఫ్‌లోను గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారికి తమ వంతు సాయం చేస్తూ అందరి మనసులు గెలుచుకుంటున్నారు. తాజాగా ఓ చిన్నారికి క్యాన్సర్ చికిత్స చేయించేందుకు బాలయ్య ముందుకు వచ్చారు.
మల్కాజ్ గిరికి చెందిన మణిశ్రీ అనే ఒక చిన్న పాప క్యాన్సర్ వ్యాధితో బసవతారకం హాస్పిటల్ లో చేరింది. మణిశ్రీ ఆపరేషన్ కోసం 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. చిన్నారి తల్లిదండ్రులు దాతల సాయంతో లక్షా 80 వేల వరకూ డబ్బులు సేకరించారు. మిగతా మొత్తం సర్ధుబాటు చేయలేని పరిస్థితులలో మణిశ్రీ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో బాలకృష్ణ అభిమాని సంఘం అధ్యక్షుడిని కలిసి పరిస్థితిని వివరించారు.
బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మణిశ్రీ వ్యాధి గురించి.. ఆపరేషన్య విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్ళాడు. వెంటనే బాలకృష్ణ స్పందించి పాపా ఆపరేషన్ కు కట్టాల్సిన 5 లక్షల 20 వేల రూపాయలు మాఫీ చేయించారు. అంతేకాదు చిన్నారికి తగిన చికిత్స అందించమని వైద్య సిబ్బందికి చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు సంతోషం తెలియజేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

