అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK111’(వర్కింగ్ టైటిల్) షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరోవైపు వివేక్ ఆత్రేయ సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ దసరా రోజున ప్రారంభం కానున్నట్టు వినికిడి. ఇదిలావుంటే.. ఇదే జోష్ని కొనసాగిస్తూ మరో దర్శకుని కథకు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవలే ఆయనకు ‘నాంది’ఫేం విజయ్ కనకమేడల ఓ కథ వినిపించారట. ఆ కథ బాలకృష్ణకు బాగా నచ్చడంతో భుజం తట్టి Go ahead అనేశారట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్‌ని స్టార్ట్ చేస్తారట. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలిసింది.