తెలుగు చిత్రసీమలో సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, సైన్స్‌ఫిక్షన్, భక్తిరసాత్మకం.. ఇన్ని జానర్లలో నటించిన ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ మాత్రమే. ఆరేళ్లక్రితం హిస్టారికల్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో బాక్సాఫీస్ దగ్గర సంచనలం సృష్టించారాయన. విమర్శకుల ప్రశంసలందుకోవడమే కాక, కమర్షియల్‌గా కూడా సంచలన విజయాన్ని సాధించింది ఆ సినిమా. త్వరలో బాలయ్య మరో హిస్టారికల్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. శతాబ్దాల క్రితం తెలుగునేలను పాలించిన ఓ మహారాజు కథతో ఈ సినిమా రూపొందనున్నట్టు వినికిడి. ప్రస్తుతం ఆయన కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా తర్వాత ‘అఖండ2’ను పట్టాలెక్కిస్తారు. నిజానికి బాలయ్యతో సినిమాలు చేయటానికి చాలామంది దర్శకులు క్యూలో ఉన్నారు. మరి ఈ కథను తెరకెక్కించే దర్శకుడెవరు? ఈ కథ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? దీనికి నిర్మాత ఎవరు? ఇంతకీ శతాబ్దాల క్రితం తెలుగునేలను పాలించిన ఆ మహారాజు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.