Namrata | మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘ముఫాసా- ది లయన్ కింగ్’. బారీ జెంకిన్స్ దర్శకుడు. 2019లో వచ్చిన యానిమేటెడ్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్’కి కొనసాగింపుగా వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. ఇందులో ప్రధాన పాత్ర అయిన ‘ముఫాసా’కి అగ్ర హీరో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని ఈ సినిమా పోస్టర్ని ఆదివారం హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నమ్రత మాట్లాడుతూ..
‘ఇది ఫ్యామిలీ ఎమోషనల్ రైడ్. మహేశ్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.’ అని తెలిపారు. ఇంకా ఇందులోని కీలక పాత్రలైన టాకా, టిమోన్ పాత్రలకు వాయిస్ ఓవర్స్ ఇచ్చిన సత్యదేవ్, అలీ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. ఇందులోని పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్ పాత్రకు అయ్యప్ప పి.శర్మ వాయిస్ ఓవర్స్ ఇచ్చారు. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.