‘అతనొక ఇంటర్‌పోల్ ఆఫీసర్. వృత్తిలో నిబద్దతకు పెట్టింది పేరు. విద్రోహక శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ఆయన చేసిన పోరాటం, ఎదురైన సవాళ్లేమిటన్నదే ‘ది ఘోష్ట్’ చిత్ర కథాంశం’ అని చెప్పారు ప్రవీణ్ సత్తారు. ఆయన దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఓ యాక్షన్ సీక్వెన్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది.
ఈ నెల 9న ఫస్ట్ విజువల్‌ను విడుదల చేయబోతున్నారు. గురువారం ‘కిల్లింగ్ మెషీన్’ పేరుతో అనౌన్స్మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగార్జున చేతిలో కత్తి పట్టుకొని సీరియస్‌గా కనిపిస్తున్నారు. ‘యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. నాగార్జున పాత్ర కొత్త పంథాలో ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. సోనాల్‌చౌహాన్, గుల్‌పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ముఖేష్ జీ, సంగీతం: భరత్-సౌరభ్, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.