The Ghost Movie Thamahagane Promo | చాలా కాలం తర్వాత ‘బంగార్రాజు’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు నాగార్జున. కొడుకు నాగచైతన్యతో కలిసి నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఈ ఏడాది మొదటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కమర్షియల్‌గా ఈ చిత్రం నాగార్జునకు మంచి బూస్టప్ ఇచ్చింది. ప్రస్తుతం ఇదే జోష్‌తో ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. ఇక ఇటీవలే విడుదలైన గ్లింప్స్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి యాక్షన్ ప్రోమోను విడుదల చేశారు.
తాజాగా విడుదలైన యాక్షన్ ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ‘విక్రమ్ నువ్వెక్కడున్నావో మాఫియాకు తెలిసిపోయింది. వాళ్ళు నీ కోసం వస్తున్నారు’ అంటూ టీజర్ ప్రారంభమైంది. ‘రాని’ అంటూ నాగార్జున ఇనుమును కరిగించి పదునైన కత్తిని తయారు చేసి యాక్షన్‌కు సిద్ధంగా ఉంటాడు. దాదాపు రెండున్నర నిమిషాలున్న ఈ ప్రోమో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. నాగార్జున క్లాస్‌లుక్‌లో మాస్ యాక్షన్ చూపించబోతున్నట్లు ఈ ప్రోమో చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రంలో నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫిసర్‌గా కనిపించనున్నాడు.
‘ది ఘోస్ట్’ చిత్రంలో నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహన్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కురి రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రోమోలో వెల్లడించారు.