నాగార్జున ఇంటర్‌పోల్ అధికారి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఇటీవలే దుబాయ్‌లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. ‘ఊటీ షెడ్యూల్లో నాగార్జున, కథానాయిక సోనాల్ చౌహాన్‌పై ముఖ్య ఘట్టాలను తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాలో నాయకానాయికలిద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపిస్తారు. ఓ ఆపరేషన్‌ను పూర్తి చేయడానికి వారు అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు థ్రిల్‌ను పంచుతాయి. నాగార్జున పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుంది’ అని చిత్రబృందం తెలిపింది. ‘ఊటీలో ఉదయాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి’ అంటూ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ట్వీట్ చేశారు. గుల్‌పనాగ్, అనిఖా సురేంద్రన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ముఖేష్ జీ, యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, నిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.