Nagarjuna | తాజాగా ఓ నటి నాగార్జునకి సంబంధించిన సీక్రెట్ బయటపెట్టి అందరు ఉలిక్కిపడేలా చేసింది.నాగార్జున తన చెంపపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సార్లు కొట్టాడని చెప్పుకొచ్చింది. మరి ఆ నటి ఎవరనే కదా మీ డౌట్. ఫిజా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇషా కొప్పికర్. ఈ అమ్మడు హిందీతోపాటు తెలుగు చిత్రాల్లో కూడా నటించింది. అక్కినేని నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమాలో కనిపించి ఎంతగానో అలరించింది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ కాంటేలోని ఇష్క్ సముందర్ కంపెనీలోని ఖల్లాస్ వంటి స్పెషల్ సాంగ్స్ చేసింది. అయితే చంద్రలేఖ సినిమాలో ఈ భామ తన నటనతో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో చంద్రలేఖ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనని పంచుకుంది. చంద్రలేఖ చిత్రం నాకు రెండో సినిమా కాగా, ఇందులో నాగ్ నన్ను కోపంగా కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. అయితే ఆయన మొదట నన్ను మెల్లగా కొట్టారు. సీన్ పండలేదు. గట్టిగానే కొట్టండి అని నాగార్జునకి చెప్పాను. అయితే ఆ సీన్ బాగా రావడం కోసం నా చెంపపై నాగార్జున 14,15 సార్లు కొట్టారు. సీన్ పూర్తయ్యాక నా ముఖం అంతా కందిపోయింది. చెంపపై వాతలు పడ్డాయి. నాగార్జున నా పరిస్థితి చూసి క్షమాపణలు చెప్పారు. అప్పుడు సన్నివేశం డిమాండ్ చేసినప్పుడు ఇలాంటివి సహజమే అని అన్నాను అంటూ ఇషా కొప్పికర్ ఆనాటి విషయాలని గుర్తు చేసుకుంది.
1997లో వరప్రసాద్ అనే సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఇక తన రెండో సినిమాగా చంద్రలేఖ చిత్రం చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళం,హిందీ భాషలలో పలు సినిమాలు చేసింది. 2017లో నిఖిల్ హీరోగా వచ్చిన కేశవ చిత్రంలో కూడా కనిపించింది. దాదాపు 80కి పైగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడ మరాఠి, హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు వెబ్ సిరీస్లు కూడా చేస్తుంది. ఆ మధ్య ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడారు. దాదాపు 29 ఏళ్ల నాటి విషయాన్ని బయటపెట్టింది. 18 ఏళ్ల వయసులో ఒక నటుడు నా దగ్గరకు వచ్చి తనతో స్నేహంగా ఉండాలని.. అప్పుడే అవకాశాలు వస్తాయని చెప్పారు. ఆ స్టార్ హీరో తనను ఒంటరిగా కలవడానికి రమ్మన్నాడు. అంతేకాదు.. నా వెంట డ్రైవర్ కూడా ఉండకూడదని చెప్పాడు. ఒంటరిగా రావాలని నిర్మాతలు కూడా చాలాసార్లు చెప్పారు అని పేర్కొంది ఇషా.