Nagarjuna | శర్వానంద్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ విడుదలైన మొదటి రోజు నుంచే మంచి స్పందనను సొంతం చేసుకుంది. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో వినూత్న ప్రయత్నంగా నిలుస్తోంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ చిత్రాన్ని భావోద్వేగాలు, యాక్షన్, టెక్నికల్ విలువలతో మిక్స్ చేస్తూ తెరకెక్కించగా, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించగా, మాళవిక నాయర్ హీరోయిన్గా కనిపించారు. సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో మెప్పించారు. ముఖ్యంగా రేసింగ్ సన్నివేశాలు, క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమా చూసిన కింగ్ అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని అభినందించారు. బైకర్ అనేది కుటుంబ భావోద్వేగాలు, సంబంధాలను ఎంతో అందంగా చూపించిన చిత్రం. రేసింగ్ సీన్స్, క్లైమాక్స్ అద్భుతంగా తీర్చిదిద్దారు. టెక్నికల్‌గా కూడా సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంది అని ప్రశంసించారు. అలాగే, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా విద్యార్థి అయిన దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ కథను ఇంత మెచ్యూరిటీతో తెరకెక్కించడం గర్వకారణమని నాగార్జున పేర్కొన్నారు. మొత్తం చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
నాగార్జున ప్రశంసలపై దర్శకుడు అభిలాష్ రెడ్డి స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. మీ మాటలు మా టీమ్‌కు ఎంతో విలువైనవి. అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా కాలేజీ స్టూడెంట్‌గా మీ నుంచి ఇలాంటి ప్రశంసలు అందుకోవడం నాకు ప్రత్యేకంగా ప్రేరణనిస్తోంది అని అన్నారు. ఈ సినిమాలోని భావోద్వేగాలు, అనుబంధాలు, టెక్నికల్ అంశాలు ప్రేక్షకులకు నచ్చడం సంతోషంగా ఉందని, నాగార్జునలాంటి లెజెండ్ నుంచి వచ్చిన ప్రోత్సాహం తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని అభిలాష్ తెలిపారు. ‘బైకర్’ సినిమా కథ, రేసింగ్ ఎలిమెంట్స్, భావోద్వేగాలు కలగలిపి వినూత్న ప్రయత్నంగా నిలుస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది బైకర్ చిత్రం.