అగ్ర నటుడు నాగార్జున ప్రస్తుతం తన వందో చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘కింగ్100’ ‘లాటరీ కింగ్’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా షూటింగ్‌ను కంప్లీట్ చేసి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలుపెడతారని సమాచారం. ఓ సామాన్యుడు అసాధారణ శక్తిగా ఎదిగిన వైనాన్ని ఆవిష్కరించే కథాంశమిదని, ఇందులో నాగార్జున విభిన్న కాలాల్లో, డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని అంటున్నారు.
ఏఐ సాంకేతికతతో నాగార్జున రెట్రోలుక్స్ని రీక్రియేట్ చేయబోతున్నారని తెలిసింది. ఆయన లుక్స్‌తో పాటు క్యారెక్టర్ ప్రజెంటేషన్ సరికొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని దసరా బరిలో దించేందుకు నాగార్జున సన్నాహాలు చేస్తున్నారట. టబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.