Nagarjuna | బాహుబలి, RRR వంటి సినిమాల రాకతో మన ఇండియన్ సినిమాలకి దేశ విదేశాలలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జపాన్‌లో అయితే తెలుగు సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే వారు వేలల్లోనే ఉన్నారు. మన సౌత్ హీరోలు రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్,అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారికి రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ఆ లిస్టులో మన కింగ్ నాగార్జున కూడా చేరిపోవడం విశేషం. అక్కడ నాగ్ సినిమాలు ఒక్కటి విడుదల కాకపోయిన కూడా నాగ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఐదేండ్ల క్రితం రణభీర్ కపూర్, అలియా భట్ జంటగా వచ్చిన భారీ చిత్రం బ్రహ్మాస్తలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం నాడు జపాన్‌లో విడుదలై మంచి విజయం సాధించిన క్రమంలో హీరో, హీరోయిన్స్‌తో పాటు నాగ్‌కి కూడా ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇటీవల కుబేర సినిమా ఓటీటీలో రిలీజ్ అవగా ఈ చిత్రాన్ని చూసిన అక్కడి ఫ్యాన్స్ నాగ్ సామ అంటూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. జపనీస్ సంస్కృతిలో ‘సామ’ అనే పదం దేవుళ్లు, రాజులు వంటి గౌరవనీయుల వారి పేరు పక్కన ఉపయోగిస్తారు.ఇప్పుడు నాగార్జునకు జపాన్ ప్రజలు ఇచ్చే గౌరవం ఎంత స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదే ఒక ఉదాహరణ.
జపాన్ ప్రజల్లో నాగార్జునకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ‘మనం’ సినిమాను అక్కడ రీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘మనం’ రీ-రిలీజ్ సందర్భంగా, థియేటర్‌కి వచ్చే జపాన్ అభిమానులతో వర్చువల్ వీడియో కాల్ ద్వారా నాగార్జున మాట్లాడనున్నారు. జూమ్ లేదా గూగుల్ మీట్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది జపాన్ ఫ్యాన్స్‌కి ఓ మరిచిపోలేని అనుభూతి అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది. అయితే ఆగస్ట్ 8న మనం చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ‘కుబేర’ విజయానంతరం నాగార్జున ఆగస్టు 14న విడుదల కాబోతున్న ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో ఆయన మాస్ యాక్షన్ లుక్‌లో విలన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే… ఈ సినిమాలో ఆయన పాత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ధీటుగా ఉంటుందన్న ప్రచారం టాలీవుడ్లో జోరుగా నడుస్తోంది.