SS Rajamouli | ‘నా సామిరంగ’తో డీసెంట్ హిట్ అందుకున్నారు నాగార్జున. ఈ వేడిలోనే శేఖర్‌కమ్ముల సినిమాను కూడా చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నారాయన. ధనుష్ కథానాయకుడిగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగార్జున అండర్‌వరల్డ్ డాన్‌గా కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘ధారావి’ అనే టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ‘ధారావి’ అనేది ముంబాయ్‌లోని ఓ ప్రాంతం. ఆ ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని వినికిడి. ఇదిలావుంటే.. తమిళ దర్శకుడు నవీన్ దర్శకత్వంలో కూడా నాగ్ ఓ చిత్రం చేయనున్నారు. ఇది పూర్తిస్థాయి యాక్షన్ సినిమా రూపొందనుందని సమాచారం. అయితే, ఇది ఓటీటీ సినిమాగా రానుందని తెలిసింది.
ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. మహేశ్‌బాబుతో ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రంలో నాగార్జున ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నట్టు తాజా సమాచారం. ఈ అంశంపై నాగార్జున, రాజమౌళీల మధ్య చర్చలు కూడా జరిగాయని ఫిల్మ్‌నగర్ టాక్. రాజమౌళి సినిమాలో నాగార్జున అనే వార్త నిజంగా అక్కినేని అభిమానులకు శుభవార్తే. ఏదేమైనా సిక్స్టీప్లస్లో కూడా యువహీరోలకు పోటీగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న నాగార్జునను అభినందించాల్సిందే.