నాగ చైతన్య సమంత విడాకుల విషయంలో తాను మాట్లాడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని హీరో నాగార్జున తెలిపారు. సమంతనే ముందుగా నాగ చైతన్యను విడాకులు కోరిందని తాను చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం అసత్యమని నాగార్జున స్పష్టం చేశారు. నాగార్జున ఒక ఇంటర్వ్యూలో సమంత విడాకులు కోరిందని వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో వార్తలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు. నాగ చైతన్య, సమంత విడాకుల గురించి నేనేమీ మాట్లాడలేదు. వాళ్ల విడాకుల విషయంలో నేను చెప్పినట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లే. దయచేసి ఇలాంటి వదంతులను వార్తలుగా ప్రసారం చేయవద్దని కోరుతున్నాను. అని నాగార్జున తన ట్వీట్ లో పేర్కొన్నారు.