Nagarjuna | కెరీర్‌ని ఎప్పుడు ఎలా మలచుకోవాలో నాగార్జునకి తెలిసినంతగా ఎవరికి తెలియకపోవచ్చు. ఆయన ఫ్లాపులు వచ్చిన అధైర్యపడరు. ఈ వయస్సులోను కూడా ఉత్సాహంగా సినిమాలు, టీవీ షోస్, యాడ్స్‌తో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఈ ఏడాది మల్టీ-స్టారర్ ప్రాజెక్టులు, పవర్ఫుల్ పాత్రలతో తెరపై ఆకట్టుకుంటూ, వెర్సటైల్ యాక్టింగ్‌తో సత్తా చాటుతున్నారు నాగ్. హీరోగా కాకుండా సపోర్టింగ్ పాత్రలు చేసిన కూడా అవి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది నాగార్జున కుబేర, కూలీ చిత్రాలతో ప్రేక్షకులని పలకరించగా, కుబేరలో పాజిటివ్ షేడ్స్ ఉన్న దీపక్ పాత్రలో నటించారు. కూలీ లో మాత్రం పవర్ ఫుల్ నెగటివ్ రోల్ సైమన్ గా కనిపించారు.
స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి, ఇతర హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు చేయడమంటే చిన్న విషయం కాదు. కానీ నాగార్జున ఆ ఛాలెంజ్ స్వీకరించి సత్తా చాటుతున్నారు. ఈ రెండు పాత్రల ద్వారా ఆయనకు టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ మార్కెట్ పెరిగింది. ఇప్పుడు నాగార్జున తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలవబోయే 100వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఓ టాక్ షోలో మాట్లాడిన నాగార్జున, తన 100వ సినిమాకు తమిళ డైరెక్టర్ కార్తీక్ ను ఎంపిక చేసినట్టు తెలిపారు.
ఈ సినిమా త్వరలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఇది యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోంది. “కింగ్ 100” అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు నాగార్జున బిజీ షెడ్యూల్ ఇక్కడితోనే ఆగలేదు. బిగ్ బాస్ సీజన్ 9 కు కూడా హోస్ట్‌గా కూడా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్‌లో ఇది మొదలు కానుంది. ఒకవైపు రియాలిటీ షో షెడ్యూల్, మరోవైపు సినిమా షూటింగ్.. రెండింటినీ సమాంతరంగా నిర్వహించేందుకు నాగార్జున ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి 2025లో నాగ్ బిజీయెస్ట్ స్టార్‌గా మారారు. నాగార్జున తన 100వ సినిమాలో చాలా డైనమిక్ పాత్రలో కనిపించనున్నారట. ఎమోషన్స్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అన్నీ కలగలిసిన ఈ చిత్రం ఆయన కెరీర్‌కు మైల్ స్టోన్‌గా మారాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.