Naa Saami Ranga | టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం నా సామి రంగ (Naa Saami Ranga) సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకత్వంలో నాగార్జున 99వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేందుకు రెడీ అవుతుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. కాగా ఇదిలా ఉంటే నాగార్జున తమిళ దర్శకుడు అనిల్‌తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. జ్ఞానవేళ్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ మూవీకి Love Action Romance టైటిల్ పెట్టారట. ఈ క్రేజీ చిత్రంలో నాగ్ పక్కా యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. స్టూడియో గ్రీన్ నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరు కనిపించబోతున్నారు.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారట. మొత్తానికి కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నాగ్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సర్ప్రైజ్ గెటప్స్‌లో అలరించేందుకు రెడీ అవుతున్నాడని తాజా అప్డేట్తో అర్థమవుతోంది.
ఇప్పటికే లాంఛ్ చేసిన నా సామి రంగ టైటిల్, ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఆషికా రంగనాథ్ పోషిస్తున్న వరలక్ష్మి రోల్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను కూడా షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.ఆషికా రంగనాథ్ వరలక్ష్మి పాత్రలో అచ్చ తెలుగు అమ్మాయిలా లంగావోణిలో క్యూట్‌గా కనిపిస్తూ సందడి చేస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్స్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు.
కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని నా సామి రంగ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతుండటం విశేషం. గతంలో సంక్రాంతి బరిలో నిలిచిన బంగార్రాజు మంచి హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఇదే సీజన్లో వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
నా సామి రంగ లుక్..
Here’s the Enchanting Glimpse of Varalakshmi aka @AshikaRanganath ❤️💫
– https://t.co/BpUG8MsaIf#NaaSaamiRanga First Single #YethukelliPovalanipisthunde coming soon✨️
Oscar Winner @mmkeeravaani musical🎶#NSRForSankranthi
KING 👑 @iamnagarjuna @vijaybinni4u @KumarBezwada… pic.twitter.com/SlW2922j3p
— Srinivasaa Silver Screen (@SS_Screens) December 4, 2023
మ్యూజిక్ సిట్టింగ్స్..
నా సామిరంగా పాటల సందడి❤️🔥
KING @iamnagarjuna with the Academy Award Winning music Composer @mmkeeravaani & lyricist @boselyricist at #NaaSaamiRanga music sittings 🎶
A sensational album guaranteed 💥💥
WW Release on Sankranti 2024🤩@vijaybinni4U @KumarBezwada @srinivasaaoffl… pic.twitter.com/KiWz9DAlcC
— BA Raju’s Team (@baraju_SuperHit) November 14, 2023
నా సామి రంగ ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్..
జా.. జా.. జాతర.. ఇది గణపయ్య జాతర✨️❤️
Team #NaaSaamiRanga wishes all a #HappyVinayakaChavithi
WW Release on Sankranti 2024🤩@iamnagarjuna @ChoreographerVJ @mmkeeravaani @KumarBezwada @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/QP1bYIi9Ri
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 18, 2023