ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు ఇద్దరు హీరోలు కలిసి నటించడం అంటే పెద్ద ప్రహసనం. ఇప్పుడైతే పరిస్థితులు అలాలేవు. స్టార్లు కలిసి స్క్రీన్‌షేర్ చేసుకునేందుకు ఓ రేంజ్లో ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ విషయంలో వెంకటేష్ అందరికంటే కాస్త ముందున్నారనే చెప్పాలి. ఆయన ఇప్పటికే మహేష్‌తో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్‌కల్యాణ్‌తో ‘గోపాలా గోపాలా’, రామ్‌తో ‘మసాలా’ సినిమాలు చేసేశారు.
ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హృతిక్‌రోషన్‌తో మల్టీస్టారర్ ‘వార్2’ చేస్తూ తారక్ బిజీగా ఉన్నారు. రీసెంట్గా ‘ఆన్స్టాపబుల్’ కార్యక్రమంలో బాలకృష్ణ కూడా చిరంజీవితో నటించేందుకు సై అనేశారు. ఇక దమ్మున్న కథలు తయారవ్వడమే తరువాయి. అలాంటి ఓ దమ్మున్న కథనే దర్శకుడు చందూ మొండేటి సిద్ధం చేసుకున్నారట.
అదొక కాప్స్టోరీ. నాగార్జున, వెంకటేష్‌ల కోసం ఆయన ఈ కథను రాసుకున్నారట. వారితో ఆ కథను తెరకెక్కించడం జీవితాశయంగా చందూ భావిస్తున్నట్టు సమాచారం. మరి చందూ మొండేటి లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందో.. తెరపై నాగ్, వెంకీలను ఒకేసారి చూసే భాగ్యం ఆడియన్స్‌కి ఎప్పుడు కలుగుతుందో చూడాలి.