Jayamma Panchayathi Pre-Release event | సుమ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో. తన యాంకరింగ్, ప్రాసలు, పంచ్‌లతో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం సుమ వెండితెరపై కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈవిడ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్. ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకుల అటెన్షన్‌ను చిత్రం వైపు తిప్పుకుంటున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది.
జయమ్మ పంచాయితి ప్రీ రిలీజ్ వేడుకను ఏప్రిల్ 30న హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా అక్కినేని నాగార్జున, నాని హజరుకానున్నారు. తాజాగా మేకర్స్ ఈవెంట్ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మించాడు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో దేవీ ప్రసాద్, దినేష్ కుమార్, షాలినీ కొండెపూడీ కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎడిటర్ రవి తేజ గిరిజాల, సినిమాటోగ్రాఫర్ అనుష్ కుమార్.
Get ready for the Grand Pre release event of #JayammaPanchayathi.
Chief guests King @iamnagarjuna & Natural 🌟 @NameisNani
📍Daspalla convention
⏰Tomorrow 6PM onwards#JayammaPanchayathiOnMay6th@ItsSumaKanakala @VijayKalivarapu @vennelacreation @adityamusic @shreyasgroup pic.twitter.com/iTBPj5aYsk— Vennela Creations (@vennelacreation) April 29, 2022