sunny in bigg boss 5 telugu | శనివారం వచ్చిందంటే చాలు బిగ్‌బాస్‌లో నాగార్జున విశ్వరూపం కనిపిస్తోంది. సండే ఫన్ డే కాబట్టి ఆ రోజు ఎవరిని ఏమి అనడు. కానీ దాని ముందు రోజు మాత్రం అందరినీ ఉతికి ఆరేస్తాడు. ఆ వారం ఎవరెవరు ఏయే తప్పులు చేశారో గుర్తు పెట్టుకొని మరి ఏకిపారేస్తాడు నాగార్జున. ఈ వారం కూడా ఇదే జరగబోతుంది. మరీ ముఖ్యంగా శుక్రవారం ఎపిసోడ్ రచ్చ రచ్చ అయింది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య జరిగిన రగడ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సిరి, సన్నీ మధ్య జరిగిన వాగ్వాదం తారాస్థాయికి చేరిపోయింది. నా జోలికి వస్తే తంతా.. అప్పడం చేస్తా అంటూ సన్నీ మాట్లాడిన మాటలపై షణ్ముఖ్ జస్వంత్ కూడా సీరియస్ అయ్యాడు. ఎవరిని అప్పడం చేస్తావు.. చేయి చూస్తా.. రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదా అంటూ గట్టి గట్టిగా అరిచాడు. మరోవైపు సన్నీ కూడా చాలా గట్టిగా అరిచాడు. ఇద్దరి మధ్య దాదాపు 15 నిమిషాల పాటు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
ఇంటి సభ్యులు అందరూ వారిస్తున్నా కూడా సన్నీ, సిరి, షణ్ముక్ అరుస్తూనే ఉన్నారు. కచ్చితంగా వీకెండ్లో నాగార్జున దీనిపై క్లాస్ తీసుకుంటాడు అని అందరికీ తెలుసు. ఇప్పుడు అదే జరుగబోతోంది. కేవలం సన్నీ, సిరి మాత్రమే కాదు కాజల్, ఆనీ మాస్టర్ మధ్య కూడా వాగ్వాదం బాగానే జరిగింది. ఆట ఆడుతుంటే మధ్యలో కితకితలు పెట్టింది అంటూ కాజల్‌పై మండిపడింది ఆనీ మాస్టర్. ఇలా ఈ వారం ఇంట్లో క్రమశిక్షణ లేని పనులు చాలానే జరిగాయి. వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు నాగార్జున. తాజాగా విడుదలైన ప్రోమోలో కూడా సన్నీ అడ్డంగా బుక్కయ్యాడు.
నాగార్జున కోపం చూస్తుంటే ఈ వారం కచ్చితంగా సన్నీకి కోటింగ్ మామూలుగా ఉండేలా కనిపించడం లేదు. గతంలోనే మనోడి కోపంపై నాగార్జున సీరియస్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి ఇదే సీన్ రిపీట్ చేశాడు సన్నీ. మరోవైపు కాజల్ ఆని గొడవపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నాడు నాగార్జున. ఆటలు మధ్యలో చెడగొట్టినందుకు కాజల్ పై నాగార్జున సీరియస్ అయ్యాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ వారం నాగార్జున రియాక్షన్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
priyanka singh| పింకీ ప్లాన్ చేసి మరీ సన్నీని వెన్నుపోటు పొడిచేసిందిగా..!
అనారోగ్యంగా ఉన్నా జెస్సీ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్..
Deepthi: షణ్ముఖ్‌పై అరిచినందుకు సన్నీకి ఇచ్చి పడేసిన దీప్తి
Jaswanth: జెస్సీకి తిరగబెట్టిన రోగం.. సీక్రెట్ రూంలో వింత సమస్యలతో బాధపడుతున్న మోడల్
Shanmukh: షణ్ముఖ్‌కి చుక్కలు చూపించిన సిరి.. ఏకంగా కాళ్లు కూడా పట్టించింది..!
Kartikeya |ఆమెతో 11 ఏళ్ల ప్రేమ .. లవ్ స్టోరీలో విలన్ల గురించి బయటపెట్టిన కార్తికేయ