Deepthi: షణ్ముఖ్‌పై అరిచినందుకు సన్నీకి ఇచ్చి పడేసిన దీప్తి

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. హౌజ్‌మేట్స్‌కి బయట నుండి బాగానే సపోర్ట్ లభిస్తుంది. ముఖ్యంగా హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న షణ్ముఖ్‌కి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, దీప్తి సునయన సపోర్ట్ చాలా ఉంది. అతనిని ఎవరు ఏమన్నా తన సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇస్తుంది.
కెప్టెన్సీ టాస్క్‌లో తన టవర్ కాపాడుకుంటున్న తరుణంలో సన్నీ-సిరిలకు మధ్య జరిగిన గొడవలో షణ్నూ.. సిరికి సపోర్ట్ ఇచ్చాడు. దీంతో గొడవ పెద్దదైంది. ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నావ్ అంటూ సన్నీ రెచ్చిపోయాడు. దీనిపై షణ్నూ గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన కౌంటర్ రిప్లై ఇచ్చింది.
సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్‌తో గొడవ పడిన సమయంలో సన్నీ కంట్రోల్‌గా ఉన్నప్పటికీ కొన్ని పదాలను వాడాడు. దీంతో అతడిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. షణ్ముఖ్ ప్రియురాలు దీప్తి సునైనా .. ‘అప్పడం అయిపోతావ్ అంటావా? నువ్వు బెస్ట్ అనుకో తప్పులేదు. మిగతా అందరినీ ఎందుకలా చూస్తున్నారు? చేతగాని ఆట ఏంటి? ఫిజికల్ అయి గట్టిగట్టిగా అరిస్తే ఆడినట్లా? ఫిజికల్ అవడం కన్నా మైండ్ గేమ్‌తో ఆడుతున్న షన్నూనే బెస్ట్. యూట్యూబ్ వరకే అంటారా? దాని వెనుక కష్టం తెలుసా’ అంటూ సన్నీని ఏకిపారేసింది.
సిరి సపోర్ట్ గురించి మాట్లాడుతూ.. ‘ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని షన్నూ గేమ్ ఆడుతున్నాడా? మరి మీకు కాజల్ సపోర్ట్ చేస్తే మేము అలాగే ఫీల్ అవుతున్నామా? షణ్ముఖ్ నాకు క్లోజ్ అన్నది పక్కన పెడితే వాడు బిగ్ బాస్‌లో ఎంతో మెచ్యూర్‌గా ఆడుతున్నాడు. హుందాగా కనిపిస్తున్నాడు. షన్నూ నీకు మరింత ధైర్యం కావాలని కోరుకుంటున్నా’ అంటూ దీప్తి రాసుకొచ్చింది. తప్పు అయితే నేర్చుకుంటాం రా బై అని ఎంత బాగా చెప్పావ్ షణ్నూ..నిన్ను హగ్ చేసుకోవాలనుంది’ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెద్ద పోస్టే పెట్టింది దీప్తి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

