priyanka singh| పింకీ ప్లాన్ చేసి మరీ సన్నీని వెన్నుపోటు పొడిచేసిందిగా..!

pinky in big boss | బిగ్ బాస్ షో రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లకు పింకీ అలియాస్ ప్రియాంక ( priyanka singh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకు ముందు జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు సంపాదించుకున్న సాయి తేజ.. ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది పింకీ. ఈమె చేస్తున్న కొన్ని పనులు చేస్తుంటే ప్రేక్షకులు నిజంగా షాక్ అవుతున్నారు. తన కోసం గేమ్ ఆడటానికి వచ్చిందా లేదంటే మానస్ కోసం వచ్చిందో అర్థం కావడం లేదు. పూర్తిగా తన గేమ్ ఆడటం మరిచిపోయి కొన్ని రోజులుగా మానస్ కోసమే ఆడుతుంది పింకీ. ఈ క్రమంలో వేరే కంటెస్టెంట్స్‌కు వెన్నుపోటు పొడవడానికి కూడా సిద్ధం అవుతుంది. అన్నయ్య అన్నయ్య అంటూ సన్నీని వెన్నుపోటు పొడిచి.. కెప్టెన్ కాకుండా ఆపేసింది అంటూ సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతుంది. తనకు, మానస్‌కు రాని కెప్టెన్సీ సన్నీకి కూడా రాకూడదు అంటూ పింకీ మాస్టర్ ప్లాన్ వేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో పింకీ పర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే ఇందులో నిజం కూడా లేకపోలేదు అనిపిస్తుంది. సన్నీకి సాయం చేస్తున్నట్లే నటించి వెన్నుపోటు పొడిచింది పింకీ.

అసలు విషయం ఏంటంటే సన్నీ కెప్టెన్సీ టాస్క్‌లో తనకు రక్షణగా కాజల్, మానస్, పింకీలను పెట్టుకున్నాడు. ఇందులో మానస్ ఒక్కడే చివరి వరకు నిలబడ్డాడు. మధ్యలో పింకీ చేసిన కొన్ని పనుల వల్ల సన్నీ కెప్టెన్ కాలేకపోయాడు. రెండు రౌండ్స్ ముగిసిన తర్వాత పింకీ చేసిన తప్పు వల్ల సన్నీ కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటికి వచ్చేశాడు. నేను కావాలని చేయలేదు అని పింకీ చెబుతున్న కూడా సన్నీ మాత్రం అసలు నమ్మడం లేదు. అక్కడ చూస్తున్న వాళ్లకు కూడా కావాలని చేసింది అని అర్థమవుతుంది. పింకీ ప్రవర్తనతో మానస్ కూడా ఆమెకు దూరం అవుతూ వస్తున్నాడు. మరి ఈ పరిస్థితుల కారణంగా రాబోయే ఈ రోజుల్లో టాస్కులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Deepthi: షణ్ముఖ్‌పై అరిచినందుకు సన్నీకి ఇచ్చి పడేసిన దీప్తి
Jaswanth: జెస్సీకి తిరగబెట్టిన రోగం.. సీక్రెట్ రూంలో వింత సమస్యలతో బాధపడుతున్న మోడల్
Shanmukh: షణ్ముఖ్‌కి చుక్కలు చూపించిన సిరి.. ఏకంగా కాళ్లు కూడా పట్టించింది..!
Kartikeya |ఆమెతో 11 ఏళ్ల ప్రేమ .. లవ్ స్టోరీలో విలన్ల గురించి బయటపెట్టిన కార్తికేయ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

