Allu Arjun | ‘పుష్ప’ ఫ్రాంచైజీతో అందనంత స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. నిజానికి ‘పుష్ప-2’ తర్వాత ఆయన త్రివిక్రమ్‌తో సినిమా చేయాలి. కానీ ఆ ప్లేస్‌లో అట్లీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. నిర్మాత నాగవంశీ మాటల్లో దానికి గల కారణం తేటతెల్లమైంది. ‘బన్నీ, త్రివిక్రమ్ కలయికలో మేం చేయబోయే చిత్రం దేశం గర్వించేలా ఉంటుంది.
ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ ఇది. మైథాలజీ సబ్జెక్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. అయితే.. ఇది రామాయణ, మహాభారతాలకు సంబంధించిన కథ కాదు. ఇది మన ఇతిహాసాల్లో ఎవరికీ తెలియని కొత్త కథ. ఎవ్వరూ చూడని కొత్త పాత్రలో ఇందులో బన్నీ కనిపిస్తారు. పానిండియా స్థాయిలో వందలకోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా ఉంటుంది. దీనికి ప్రీప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ సమయం అవసరం. ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ పనిలోనే ఉన్నారు’ అని తెలిపారు నాగవంశీ.