నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ ఆర్ కృష్ణ దర్శకుడు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 23న విడుదలకానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని ‘Tara naa Tara’ అనే పాటను విడుదల చేశారు. మెలోడీ బాణీతో నాయకానాయికలు నాగశౌర్య, షిర్లీ సెటియాల అందమైన కెమిస్ట్రీని ఆవిష్కరిస్తూ సాగిందీ పాట. శ్రీమణి రాసిన ఈ గీతానికి మహతి స్వరసాగర్ సంగీతాన్నందించారు. నకాష్ అజీజ్ ఆలపించారు. రాధికా శరత్‌కుమార్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, సమర్పణ: శంకర్‌ప్రసాద్ ముల్పూరి, దర్శకత్వం: అనీష్ ఆర్ కృష్ణ.