Rangabali | టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి రంగబలి (Rangabali). పవన్ బసంశెట్టి (డెబ్యూ) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన రంగబలి టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మరోవైపు రంగబలి నుంచి లాంఛ్ చేసిన మన ఊరిలో ఎవడ్రా ఆపేది, కల కంటూ ఉంటే (Kala Kantu Unte) సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ మూవీ లవర్స్ కోసం మరో అప్డేట్ అందించారు.
రంగబలి ట్రైలర్‌ను జూన్ 27న సాయంత్రం 4.05 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్ షేర్ చేశారు. నాగశౌర్య వినాయకుడి ఊరేగింపులో పాల్గొనడం పోస్టర్లో చూడొచ్చు. తాజా లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
రంగబలిలో సత్య, అనంత్ శ్రీరామ్, గోపరాజు రమణ, కల్యాణి నటరాజన్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, సప్తిగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి, భద్రం, శివనారాయణ, పీకే, పవన్, నోయెల్, రమేశ్ రెడ్డి, హరీష్ చంద్ర, బ్రహ్మాస్త్రి, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రంగబలి జులై 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. నాగశౌర్య మరోవైపు నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
ట్రైలర్ అప్డేట్ లుక్..
Make way for ‘Show’ Anna aka @IamNagashaurya ❤🔥
Enter his MASSively Entertaining world of #Rangabali 🔥
Theatrical Trailer on June 27th at 4.05 PM 💥
In Cinemas July 7th!#YuktiThareja @PawanBasamsetti @pawanch19 @DivakarManiDOP #KarthikaSrinivas #ASPrakash @saregamasouth pic.twitter.com/qgqw0BR1ey
— SLV Cinemas (@SLVCinemasOffl) June 25, 2023
కల కంటు ఉంటే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
కల కంటు ఉంటే సాంగ్ ప్రోమో..
రంగబలి టీజర్..
మన ఊరిలో లిరికల్ వీడియో సాంగ్..