నాగశౌర్య, కేతికశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘లక్ష్య’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నారాయణదాస్ కె నారంగ్, పూస్కూర్ రామ్మోహన్రావు, శరత్‌మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. షూటింగ్ తుదిదశకు చేరుకున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పతాక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రాచీన విలువిద్య నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆర్చరీ క్రీడలో రాణించాలని కలలుకన్న ఓ యువకుడికి ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి? ఆ సవాళ్లను అతడు ఎలా అధిగమించాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. నాగశౌర్య, జగపతిబాబుతో పాటు ప్రధాన తారాగణంపై హైదరాబాద్‌లో ైక్లెమాక్స్‌ను చిత్రీకరిస్తున్నాం. భారీ హంగులతో తెరకెక్కిస్తున్న ఈ ఎపిసోడ్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఆర్చర్‌గా నాగశౌర్య సరికొత్త లుక్‌లో కనిపిస్తారు’ అని తెలిపారు. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, సినిమాటోగ్రఫీ: రామ్‌రెడ్డి.