టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) అస్వస్థతకు లోనయ్యాడు. నాగశౌర్య ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో సొమ్మసిల్లి పడిపోగా.. వెంటనే అతన్ని చిత్రయూనిట్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల బృందం నాగశౌర్యకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నాగశౌర్యకు ఇటీవలే బెంగళూరుకు చెందిన బిజినెస్ వుమెన్ అనూష శెట్టితో వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. నవంబర్ 19, 20వ తేదీల్లో వెడ్డింగ్ ఈవెంట్ జరుగనుంది. ఈ నేపథ్యంలో నాగశౌర్య ఆస్పత్రిలో చేరడంతో సినీ జనాలు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
ఈ ఏడాది కృష్ణ వ్రింద విహారి సినిమాతో మంచి సక్సె స్ అందుకున్నాడు నాగశౌర్య. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నాగశౌర్య. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో నటిస్తున్నాడు.