బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో జరిగిన టాస్క్‌లో రవి అందరితో కుషన్స్ కట్ చేయించి తాను సేఫ్‌గా ఉన్నాడు.ఇదే విషయంపై నాగార్జున అతడిని ప్రశ్నించాడు. నేను ఆ దిండ్లు చింపి కాటన్ తీద్దాం అనుకున్నా.. కానీ కత్తెర కనిపించలేదు.. కానీ శ్వేతాకి నేనేమీ చెప్పకుండా ఆమె దిండ్లు కట్ చేసి కాటన్ తీసింది. ఆ విషయం నాకు చెప్పకుండానే చేసింది అనే సరికి, సర్.. రవి అబద్ధం చెబుతున్నాడు అని శ్వేత పేర్కొంది.
నువ్ స్ట్రాటజీలు చేయి రవి తప్పులేదు.. కానీ బ్లేమ్ చేయకు అంటూ క్లాస్ పీకడం మొదలుపెట్టారు నాగార్జున. రవి చేసింది కరెక్టా తప్పా అన్నది హౌస్‌లో ఉన్నవాళ్లే చెప్పండి.. రవి చేసింది రైట్ అనేవాళ్లు చేతులు ఎత్తండి అని నాగార్జున అనడంతో ఒక్కరు కూడా చేతులు ఎత్తలేదు. రవి చేసింది రాంగ్ అనే వాళ్లు చేతులు ఎత్తకండి అంటే ఎవరు ఎత్తలేదు.
దీంతో రవి.. ‘నిజం ఏంటో నాకు తెలుసు సార్.. నాకు అనిపించింది చేస్తా.. అని అన్నాడు. ఎవరైనా తప్పు చేస్తే చెప్పడం నా బాధ్యత అది నీకు చెప్తున్నా.. దాని తరువాత నీ ప్రవర్తన నీ ఇష్టం’ అని అన్నారు నాగార్జున. మొత్తానికి నాగార్జున ..రవిని దారుణంగా అవమానించాడు.ఇంతక ముందు కూడా రవి ఇలానే బుక్కయ్యాడు.