Naga Chaitanya | హీరో నాగచైతన్య ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయన టీమ్ తెలిపింది. నాగచైతన్య ఖాతాను హ్యాక్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు బిట్ కాయిన్‌కు సంబంధించిన పోల్ పెట్టారు. ‘కొన్నేళ్ల క్రితం 100 బిట్ కాయిన్స్ కొన్నాను. ఇప్పుడు వాటి విలువ 6 మిలియన్ డాలర్లు. వాటిని ఇతరులకు పంచుదామనుకుంటున్నా. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అంటూ పోల్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది చైతూ అభిమానులు ఆయన ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించారు. మరికొందరేమో పోల్‌లో పాల్గొన్నారు. చివరకు సమస్యను పరిష్కరించిన నాగచైతన్య టీమ్ ఆ పోస్ట్‌ను తొలగించింది. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్నారు. మత్స్యకారుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.