Naga Chaitanya | అక్కినేని కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన వారసులు నాగ చైతన్య, అఖిల్. తెలుగు ప్రేక్షకుల్లో ఇద్దరికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్నా… ఓ ఆసక్తికరమైన ప్రశ్న మాత్రం ఎప్పటి నుంచో చర్చలో ఉంది. పాన్ ఇండియా డైరెక్టర్లతో వీరు ఎందుకు సినిమాలు చేయడం లేదు?, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్లతో ఎందుకు కొలబరేట్ కావడం లేదు? అనే దాని గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుంది. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ నాగ చైతన్య స్వయంగా సమాధానం ఇచ్చారు. అభిమానులు, సినీ వర్గాలు ఊహించిన దానికంటే భిన్నంగా ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
నాగ చైతన్య మాట్లాడుతూ.. ఏ డైరెక్టర్‌తో పని చేయాలనుకున్నా నాన్న (నాగార్జున) నా ముందుకు తీసుకుని రావచ్చు. అడ్వాన్స్ ఇవ్వొచ్చు. స్టూడియో నుంచి ఒక్క ఫోన్ చేసినా చాలు. డైరెక్టర్ సెట్ చేసుకోవడం ఆయనకి పెద్ద పని కాదు.నా కెరీర్లో చాలా సార్లు నాగార్జున ఇలాంటి అవకాశాలు ఇచ్చారు.. `ఏరా ఎవరికైనా చెప్పాలా ? అని చాలాసార్లు అడిగారు. డైరెక్టర్ ని సెట్ చేయడం నాన్నకి క్షణాలలో పని. డైరెక్ట్ గా నన్ను తీసుకెళ్లి మాట్లాడొచ్చు. ఏ డైరెక్టర్ తో చేస్తావని నన్ను ఎన్నోసార్లు అడిగారు. ఈ విషయంలో నాన్నను ఎంత మాత్రం తప్పుగా అనుకోకూడదు. మేము స్వతంత్రంగా ఎదగాలని అనుకున్నాం కాబట్టి నాన్నని ఎక్కువగా అడగం. నాన్న సహకారంతోనే నటుడిగా వచ్చాం, ఇప్పటికీ ఆయన మీద ఆధారపడితే మేము సాధించేంది ఏమంటుంది అని చైతన్య చాలా క్లారిటీగా చెప్పాడు.
మొత్తానికి చైతూ క్లారిటీతో .. పాన్ ఇండియా డైరెక్టర్లతో పనిచేయకపోవడానికి గల అసలు కారణం అందరికి అర్ధమైంది. ప్రస్తుతం చైతన్య.. కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ఒక గుహ నేపథ్యంలో సాగే ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతుండగా, వచ్చే ఏడాది పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ‘తండేల్’ సినిమా నాగ చైతన్య కెరీర్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక అఖిల్ కూడా కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ తనదైన పంథాలో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు.