Naga Chaitanya | టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. సమంతతో విడాకుల అనంతరం నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)తో ఏడడుగులు వేయబోతున్నాడు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా పూర్తయింది. ఆగస్టు 8న హైదరాబాద్లోని నాగార్జున నివాసంలో ఈ జంట సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీంతో అంతా వీరి పెళ్లి ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు (Marriage Date Fix) తెలుస్తుంది. డిసెంబర్లో వీరు వివాహబంధంతో ఒక్కటి కాబోతుండగా.. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
డిసెంబర్ 4వ తేదీన వీరు గ్రాండ్గా వివాహం చేసుకోబోతున్నట్లు శుభలేఖలో ఉంది. డిసెంబర్ 2వ తేదీన సంగీత్, మూడో తేదీన మెహందీ, నాలుగో తేదీన పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇక డిసెంబర్ 10న గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్లు టాక్. ఈ వెడ్డింగ్ కార్డులో వధూవరుల తల్లిదండ్రుల పేర్లతో పాటు నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి, ఆమె రెండవ భర్త శరత్ విజయరాఘవన్ పేర్లతోపాటు నాగార్జున తల్లిదండ్రులు అక్కినేని నాగేశ్వరరావు(ANR), అన్నపూర్ణమ్మ పేర్లు, అలాగే దగ్గుబాటి లక్ష్మి తల్లిదండ్రులు దగ్గుబాటి రామానాయుడు, రాజేశ్వరి దంపతుల పేర్లు కూడా వెడ్డింగ్ కార్డ్ లో ముద్రించారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోను మీరు కూడా చూసేయండి.
#NagaChaitanya and #Sobhita Wedding Card Revealed pic.twitter.com/lSxTsPmVnp
— KLAPBOARD (@klapboardpost) November 17, 2024